A former Playboy model, who claims to have had a relation with Donald Trump over a decade ago, apologized to first lady Melania Trump in an interview.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో తనకు పది మాసాల పాటు శారీరక సంబంధం ఉందని మాజీ ప్లేబోయ్ మోడల్ కరెన్ మెక్ డౌగల్ చెప్పారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఫోర్న్‌స్టార్ డానియెల్‌తో వివాహేతర సంబంధం ఉందని మరువక ముందే ప్లేబాయ్ మేగజిన్ మోడల్ కరెన్ మెక్ డౌగల్ కూడ తనతో ట్రంప్‌కు శారీరక సంబంధాలున్నాయని ప్రకటించింది.
ఈ సంబంధం బట్టబయలు కాకుండా చేసుకొన్న ఒప్పందం నుండి విముక్తిని ప్రసాదించాలని కోరుతూ ఆమె కోర్టును ఆశ్రయించడంతో ఈ వ్యవహరం బట్టబయలైంది.
2006 నుండి 2007 మధ్య ట్రంప్‌కు తనకు మధ్యశారీరక సంబంధాలున్నాయని మెక్ డౌగల్ ప్రకటించారు.పది మాసాల కాలంలో ట్రంప్ తనతో శారీరక సంబంధం కొనసాగించాడని ప్రకటించిన మెక్ డౌగల్ ఈ సంబంధం పెళ్ళి వరకు దారి తీస్తోందని భావించినట్టు చెప్పారు.. కానీ, పెళ్ళి చేసుకోకుండానే తమ మధ్య సంబంధం తెగిపోయిందన్నారు.
ట్రంప్ సతీమణి మెలానియాకు ప్లేబోయ్ మోడల్ కరెన్ మెక్ డౌగల్ క్షమాపణ చెప్పారు మెలానియాకు తెలియకుండానే తాను ట్రంప్‌తో వివాహేతర సంబంధం కొనసాగించినందుకు క్షమాపణలు కోరుకొంటున్నట్టు ఆమె చెప్పారు. భవిష్యత్తులో ఇలా చేయకూడదని నిర్ణయం తీసుకొన్నానని ఆమె చెప్పారు. మెలానియాకు ఇంతకంటే ఏం చెప్పగలని ఆమె చెప్పారు.
ట్రంప్ తనతో పాటు ఉన్న పది మాసాల పాటు తామిద్దరం కూడ గాఢంగా ప్రేమించుకొన్నామని ప్లేబోయ్ మోడల్ కరెన్ మెక్ డౌగల్ చెప్పారు. ట్రంప్ కూడ ఎన్నోసార్లు తనను ప్రేమిస్తున్నట్టు చెప్పిన విషయాన్ని ఆమె సిఎన్ఎన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.ప్రతిసారి కూడ ట్రంప్ ఇదే విషయాన్ని చెప్పాడని ఆమె గుర్తు చేసుకొన్నారు.